Saturday, April 20, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో -కాకతీయ వారసుడు కమల్ చంద్రభంజ్ దేవ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వరంగల్ లో నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందడి చేసింది. కాకతీయుల 22వ వారుసుడైన కమల్ చంద్ర భంజ్ దేవ్ స్వయంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, నగర మేయర్ గుండు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.అనంతరం మాట్లాడిన “కమల్ చంద్ర భంజ్ దేవ్” కాకతీయుల పాలనలో తమ పూర్వీకులు ప్రకృతికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారని. అందులో భాగంగానే గొలుసు చెరువులు తవ్వించారు. అడవులను రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఆ ఒరవడి ఇప్పుడు కేసిఆర్ ప్రభుత్వంలో కనిపిస్తుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు నా మనసుకు చాలా దగ్గరైన పథకాలు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా దూరదృష్టితో తీసుకున్న కార్యక్రమం. మనం బావుండటమే కాదు..

ఈ నేలపై మన భవిష్యత్ తరాలు బావుండాలని వారు తలపించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” చరిత్రలో నిలిచిపోతుంది. ఇదొక కార్యక్రమంలా కాకుండా భవిష్యత్త్ లో ప్రజల నిత్యకృత్యమవుతుందని నేను భావిస్తున్నాను. తెలంగాణ ప్రజలే కాదు.. యావత్ దేశ ప్రజలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను.అనంతరం మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. ప్రతీది ప్రభుత్వమే చేయాలనుకునే సాధారణ ఆలోచనలకు భిన్నంగా రాజ్యసభసభ్యులు సంతోష్ కుమార్ గారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం తీసుకున్నారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చేసిన స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ కి, నగర మేయర్ గుండు సుధారాణి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సంధర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో “కమల్ చంద్ర భంజ్ దేవ్”కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీరు చూపించిన చొరవ కోట్లమందికి స్పూర్తిగా నిలుస్తుందన్నారు. మీ తెలంగాణ పట్ల మీకున్న ప్రేమ, అభిమానం అద్భతమని కీర్తించారు. ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సమన్వయకర్త రాఘవతో పాటు జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement