Friday, March 29, 2024

జర్మనీలో ఘనంగా మినీ మహానాడు సంబరాలు

తెలుగు జాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామరావు శతజయంతి వేడుకలు జర్మనీ లోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో అట్టహాసంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ జర్మనీ ఆద్వర్యంలో 2018 నుంచి నాలుగు సార్లు మినీ మహానాడు జరుగగా ఆదివారం నాడు 5వ మినీ మహానాడు అంగరంగ వైభవంగా మునుపెన్నడూ లేని విధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా తెలుగుదేశం పార్టీ జర్మనీ కుటుంబ సభ్యులు నందమూరి తారకరాముడికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నీలిమ కుడితిపూడి గీసిన తారకరాముడి చిత్రపటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జర్మనీ కుటుంబ సభ్యులు రాబోవు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి వారు చేయబోయే కృషిని తీర్మానాల ద్వారా సభకు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉరవకొండ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ పయ్యావుల కేశవ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, టీ-టీడీపీ విభాగం తెలుగు మహిళ అధ్యక్షులు ప్రొఫెసర్ జ్యోత్స్నా తిరునగరి వర్చ్యువల్ మీటింగ్ ద్వారా హాజరై తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సహం నింపారు. ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…. తెలుగుదేశం పార్టీ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామ‌ని పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జర్మనీ కుటుంబ సభ్యులతో పసుపు ప్రతిజ్ఞ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement