Friday, April 19, 2024

గ్రాండ్ గా పెంపుడు కుక్క బర్త్ డే.. 350మంది అతిధులు.. గిఫ్ట్ గా గోల్డ్ లాకెట్స్‌

తమ పెంపుడు కుక్క అక్సర్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు దాని యజమానులు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్‌లో చోటు చేసుకుంది. కుక్క య‌జ‌మానులు దాదాపు 350 మందికి గ్రాండ్ బ‌ర్త్‌డే పార్టీని ఇవ్వడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి లోనుచేసింది. ఇన్విటేష‌న్ కార్డులను ముద్రించ‌డం నుంచి రూ . 4500 వెచ్చించి డ్ర‌స్ కొనుగోలు చేయ‌డం వ‌ర‌కూ పెంపుడు కుక్క బ‌ర్త్‌డే పార్టీకి ఆ కుటుంబం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పెంపుడు కుక్క బ‌ర్త్‌డే కోసం ప‌రిస‌ర గ్రామాల నుంచే కాకుండా బెంగాల్‌లోని శ్రీపూర్ వంటి ప్రాంతాల నుంచి అతిధులు శున‌కం బ‌ర్త్‌డే పార్టీ కోసం ధ‌న్‌బాద్‌కు క్యూ క‌ట్టారు.

బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న కుక్క కోసం బంధువులు బ‌హుమ‌తుల‌ను కూడా తీసుకువ‌చ్చారు. మూడు గోల్డ్ లాకెట్స్‌ను పెంపుడు కుక్క‌కు కొంద‌రు బ‌హుక‌రించారు. అక్స‌ర్ కేక్ కటింగ్‌కు ముందు హార‌తి ఇచ్చారు. పెంపుడు కుక్క బ‌ర్త్‌డే వేడుక‌ల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం తెగ వైర‌ల‌వుతోంది. ఈ వీడియోలో కుక్క చెంప‌పై మ‌హిళ ముద్దు పెడుతుండ‌టం క‌నిపించింది. టేబుల్ పైన భారీ కేక్ కూడా ఈ వీడియోలో చూడ‌వ‌చ్చు. అక్స‌ర్ త‌మ కుటుంబ స‌భ్యుల్లో ఒక‌ర‌ని, త‌మ‌తోనే ఉంటూ..తాము తినేదే తింటుంద‌ని య‌జ‌మానులు సుమిత్ర కుమారి, సందీప్ చెప్పారు. పెంపుడు జంతువుల‌తో అనుబంధం అనేది ప్ర‌త్యేక‌మైన‌ద‌ని, రోడ్డు ప‌క్క‌న 20 రోజుల వ‌య‌సున్న కుక్క పిల్ల‌ను ఇంటికి తీసుకువ‌చ్చి పెంచుకున్నామ‌ని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement