సర్కారు వారి పాట చిత్రం పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుందా అంటే ఔననే అనిపిస్తోంది.
కానీ మారుతున్న ట్రెండ్ కి తగినట్టుగా ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారట. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో రిలీజ్ చేసే దిశగా పనులు జరుగుతున్నాయట. ఈ విషయంతో పాటు మిగతా భాషల్లో ఎప్పుడు రిలీజ్ చేయనున్నది త్వరలో వెల్లడి చేస్తారని చెప్పుకుంటున్నారు.ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్నారు. పరశురామ్ డైరెక్టర్ .చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. మైత్రీ – 14 రీల్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. ఈ సినిమా నుంచి వదిలిన ‘కళావతి’ సాంగ్ కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతూనే ఉంది. ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
పలు భాషల్లో సర్కారు వారి పాట – దూసుకుపోతోన్న కళావతి సాంగ్

Advertisement
తాజా వార్తలు
Advertisement