Friday, March 29, 2024

సెంట్రల్ విస్టా పూర్తికి డెడ్ లైన్ విధించిన కేంద్రం!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌‌ సంబంధించిన డెడ్‌ లైన్‌ ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ ప్రాజెక్ట్‌ లో భాగమైన ప్రధానమంత్రి నివాసం సహా మరికొన్ని భవన సముదాయాలను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని తాజా ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం 2024 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో పార్లమెంట్ సహా ప్రధానమంత్రి కార్యాలయం, ఇతర కొన్ని భవన సదుపాయాలను నిర్మిస్తున్నారు. అయితే దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతున్నా, ఈ మొత్తం భవనాల సముదాయంలో ప్రధాని నూతన నివాసం, కార్యాలయ భవనాలను డిసెంబర్ 2020 నాటికి పూర్తి చేయాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది.

ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించాయి. ఈ ప్రాజెక్టును అత్యవసరంగా పేర్కొన్న కేంద్రం.. పనులు నిరాటంకంగా కొనసాగించాలని ఆదేశించింది.  ప్రధానమంత్రి భవనం సహా ప్రధానమంత్రి ప్రత్యేక భద్రతా సిబ్బందికి సంబంధించిన భవనం, కార్యనిర్వాహక బృందానికి సంబంధించిన భవనం కూడా వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును విపక్షాలు, హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ముందుకు సాగాలనే కేంద్రం నిర్ణయించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement