Saturday, April 20, 2024

‘Pakka Commercial’: గోపీచంద్ న్యూ లుక్

యంగ్ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా సినిమా ‘పక్కా కమర్షియల్’. యూత్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో  గోపీచంద్ ను ఫ్రెష్ లుక్ తో ఈ సినిమాలో మారుతి చూపించనున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది. గతంలో వీరి కాంబినేషన్ లో జిల్ అనే మూవీ వచ్చింది.

‘పక్కా కమర్షియల్’ మూవీలో గోపీచంద్ మార్క్ యాక్షన్ తో పాటు, మారుతి మార్కు కామెడీ ఉంటుందని తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను విడుదలైంది. ఈ పోస్టర్ లో  హ్యాండ్సమ్ లుక్ తో గోపీచంద్ సాప్ట్ గా కనిపిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. అతి తర్వలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement