Wednesday, April 24, 2024

నెటిజన్లకు గూగుల్ స‌ర్ ప్రైజ్‌.. 2021 చివ‌రి రోజు డూడుల్ రిలీజ్‌..

నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే నెటిజన్లను ఉత్సాహపరిచేందుకు గూగుల్ ఈ కొత్త డూడూల్ ను రిలీజ్ చేసింది. క్యాండీలు, బెలూన్లు, లైట్లతో ఎంతో బ్యూటిఫుల్‌గా ముస్తాబు చేసింది గూగుల్. గూగుల్ విడుదల చేసిన ఈ డూడుల్ ఈ ఏడాది చివరి డూడుల్ కానుంది. అదేంటో మీరే చూసేయండి.

డిసెంబరు 30 రాత్రి 12 గంటలకు (తెల్లవారితే డిసెంబరు 31) ఈ డూడుల్ ను గూగుల్ ప్రదర్శించింది. 2021 ఏడాదికి ఇది ముగింపు.. నూతన సంవత్సర వేడుక! అంటూ డూడుల్ లో గూగుల్ పేర్కొంది.

ఈసారి, గూగుల్ తన హాలిడే డూడుల్‌ను క్యాండీ పాప్పర్‌తో 2021 అని రాసి డిజైన్ చేసింది. గడియారం అర్ధరాత్రి 12 గంటలకు చేరగానే.. ఆ క్యాండీ పాప్ అప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. డూడుల్‌లో ‘గూగుల్’కు సంబంధించిన ఇతర అక్షరాలు కూడా ఫెయిరీ లైట్‌లతో కలర్‌ఫుల్‌గా అలంకరించబడి ఉన్నాయి.

ఇది మాత్రమే కాకుండా.. న్యూఇయర్ వేడుకల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న డూడుల్ పై క్లిక్ చేసిన వెంటనే కొత్త సంవత్సరానికి సంబంధించిన వేడుకల గురించి విశేషాలను తెలియజేస్తుంది. దీంతో పాటు ఆ పేజ్ ఓపెన్ అవ్వగానే సెలెబ్రేషన్స్ మాదిరి నెటిజన్లకు సర్ ప్రైజ్ కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement