Tuesday, March 26, 2024

Google Doodle | ద సన్​ క్వీన్​.. మరియా టెల్కోస్​ యాదిలో గూగుల్​ స్పెషల్​ డూడుల్​ సెలబ్రేషన్​!

సూర్యకాంతి మానవ జీవితాలను సమూలంగా మార్చగలదని విశ్వసించి, ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్​ అయ్యారు ఓ మహిళా. అయితే ఆమె చేసిన ప్రయోగాలకు మెచ్చిన ‘‘ది సన్​ క్వీన్​” అనే మారుపేరుతో పిల్చుకుంటారు. అంతటి మహానీయురాలు అయిన మరియా టెల్కోస్​ జయంతి సందర్భంగా గూగుల్​ స్పెషల్​ డూడుల్​ని రన్​ చేసింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

సూర్య శక్తి మానవ జీవితాలను మార్చగలదని విశ్వసించి ఎన్నో ప్రయోగాలు చేశారు టెల్కోస్​. సౌరశక్తికి చెందిన మొదటి మార్గదర్శకులలో ఒకరైన “ది సన్ క్వీన్” అనే మారుపేరుతో మరియా టెల్కోస్ ప్రాచుర్యం పొందారు. ఆమె జయంతి సందర్భంగా​ ఇవ్వాల (సోమవారం) గూగుల్ స్పెషల్​ డూడుల్​ని ప్రదర్శించింది. డాక్టర్ టెల్కోస్​ డిసెంబర్ 12, 1900లో హంగేరిలోని బుడాపెస్ట్ లో జన్మించారు. ఈట్వోస్ లోరాండ్ విశ్వవిద్యాలయంలో భౌతిక రసాయన శాస్త్రాన్ని అభ్యసించారు. ఆమె 1920లో బ్యాచిలర్ డిగ్రీని, 1924లో పీహెచ్‌డీని పొందారు. మరుసటి సంవత్సరం ఆమె USకి మకాం మార్చారు. బయోఫిజిసిస్ట్ గా గొప్పపేరు తెచ్చుకున్నారు. 1937లో US పౌరసత్వం కూడా పొందారు.

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో సోలార్ ఎనర్జీ కమిటీ మెంబర్‌గా మరియా టెల్కోస్​ పని చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో US ప్రభుత్వం సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే సోలార్ డిస్టిలర్‌ను డెవలప్​ చేయడంలో సహాయం చేయమని కోరింది. 1948లో ఆమె ఆర్కిటెక్ట్ ఎలియనోర్ రేమండ్‌తో కలిసి డోవర్ సన్ హౌస్‌ని సృష్టించారు. సోలార్-హీటెడ్ హోమ్ విజయం కోసం వారు ఎన్నో ప్రయోగాలు చేసి, వాటిన మీడియాలో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. దాంతో అది కాస్త ‘సౌర శక్తి’ అనే పదంతో  ప్రాచుర్యం పొందింది.

న్యూయార్క్ యూనివర్శిటీ, ప్రిన్స్ టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ డెలావేర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో సౌరశక్తి పరిశోధనలో కూడా మరియా టెల్కోస్​ హెల్ప్​ చేశారు. ఆమె 20కి పైగా పేటెంట్లను కలిగి ఉన్నారు. అనేక ఇంధన కంపెనీలకు సలహాదారుగా పనిచేశారు. 1952లో సొసైటీ ఆఫ్ ఉమెన్ ఇంజనీర్స్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తి డాక్టర్ టెల్కేస్. ఆమె డిసెంబర్ 2, 1995న హంగేరియన్ రాజధానిలో చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement