Saturday, April 20, 2024

Good News: ఎస్‌బీఐ డిజిటల్ లావాదేవీలపై అదనపు చార్జీల్లేవు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్. ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఉప‌యోగిస్తున్న వారికి ఇదో మంచి విష‌యం. ఇక మీద‌ట డిజిట‌ల్ పేమెంట్స్ (యూపీఐ) చేస్తే ఎలాంటి చార్జి వసూలు చేయ‌బోమ‌ని ఎస్బీఐ తెలిపింది. ఒక మీడియా నివేదిక ప్రకారం, ఐఐటీ అధ్యయనంలో.. భారతదేశపు అతిపెద్ద రుణ సంస్థ ఎస్బీఐ 2017 నుంచి సెప్టెంబర్ 2020 వరకు జన్ ధన్ ఖాతాదారుల నుంచి రూ.164 కోట్లు మినహాయించిన‌ట్టు వెల్లడైంది.

అందులో యూపీఐ, రూపే కార్డుల ద్వారా లావాదేవీల కోసం బ్యాంక్ కేవలం రూ.90 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చింది. ఈ కాలంలో ఒక్కో ఖాతా నుంచి బ్యాంకు రూ.17.70 వసూలు చేసింది. ఈ నివేదికపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ.. “యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపీఐ), రూపే డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే లావాదేవీలతో సహా డిజిటల్ లావాదేవీలకు బిఎస్‌బిడి కస్టమర్‌లు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement