Saturday, April 20, 2024

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. జొమాటోలో 800ఖాళీలు

నిరుద్యోగుల‌కు శుభ‌వార్తని చెప్పింది జొమాటో.. దేశంలోని 5 లొకేషన్లలో 800 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ షేర్ చేశారు. ఇంజినీర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్, గ్రోత్ మేనేజర్స్ ను నియమించుకోవాలని చూస్తున్నామని తెలిపారు. అలాగే సీఈవోకు చీఫ్ ఆఫ్ స్టాఫ్, జెనరలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజినీర్ ను హైర్ చేసుకోనున్నట్లు లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి దయచేసి నాకు ([email protected]) మెయిల్ చేయండి. నేను లేదా నా బృందం మీకు ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఎక్కడెక్కడ, ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం షేర్ చేయలేదు.మరోవైపు “10 నిమిషాలకే డెలివరీ” సర్వీసును జొమాటో ఆపేసింది. ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్ ఏరియాల్లో గతేడాది మార్చిలో ప్రయోగాత్మకంగా ఈ సర్వీసును ప్రారంభించింది. కానీ పలు కారణాలతో దాన్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది.ప‌లు పెద్ద సంస్థ‌ల్లో ఉద్యోగుల‌ని తొల‌గిస్తుంటే..జొమాటో మాత్రం ఉద్యోగ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement