Saturday, April 20, 2024

డీఎస్సీ 2008 అభ్యర్థులకు శుభవార్త

డీఎస్సీ 2008 అభ్యర్థులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 2008 అభ్యర్థుల సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు. మినిమం టైం స్కేలుతో వారికి కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగలిచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారని గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని ఆయన వివరించారు. డీఎస్సీ 2008 అభ్యర్థులను పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో వారికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. కోర్టులు కూడా అభ్యర్థులకు సానుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు సీఎం ఆదేశాలిచ్చారని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కమిటీ పరిశీలనలో ఉందని ఆయన వివరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేసే స్థానాల్లో ఖాళీలు లేకుండా నియామకాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్ట్ పోస్టులు మినహా మిగిలిన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తామని సీఎం చెప్పారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement