Thursday, April 25, 2024

ఈ రాశివారికి శుభ‌ము.. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి

మేషరాశి (Aries): అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి ఈ రోజు శ్రమపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు తాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus): కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి ఈ రోజు పనుల్లో పురోగతి. ఇంటాబయటా ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.

మిధునరాశి ( Gemini): మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి ఈ రోజు బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింతగా పెరుగుతుంది. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఇబ్బందులు., ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి.

కర్కాటకరాశి ( Cancer): పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో సఖ్యత. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.

- Advertisement -

ఇది చదవండి: రాజీనామాలు చేసినా బీజేపీదే గెలుపు : తోమర్‌..

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి ఈ రోజు దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. సోదరుల కలయిక. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.

కన్యారాశి ( Virgo): ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి ఈ రోజు పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.

తులారాశి ( Libra): చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. సన్నిహితులతో వివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.

ఇది చదవండి: ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి కారణ‌మ‌దే.. ఎంక్వైరీలో తేలిన సంచలన వాస్తవాలు

వృశ్చికరాశి ( Scorpio): విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి ఈ రోజు నిరుద్యోగులకు శుభవార్త. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.

ధనుస్సురాశి ( Sagittarius): మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది.

మకరరాశి ( Capricorn): ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి.

ఇది చదవండి: అమెరికాలో రంగంలోకి సైన్యం.. కరోనా కట్టడికి కీలక నిర్ణయం..

కుంభరాశి ( Aquarius): ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి ఈ రోజు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.

మీనరాశి ( Pices): పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి ఈ రోజు నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. విందువినోదాలు. వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో కొత్త ఆశలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement