Friday, April 26, 2024

‘గోల్డెన్ గ్లోబ్’ పుర‌స్కారానికి నామినేట్ అయిన జై భీమ్ ..

జైభీమ్ చిత్రం సంచ‌ల‌నం సృష్టించింది.. ప్ర‌ముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎమ్ డీబీ సినిమాల జాబితాలో ఫ‌స్ట్ ప్లేస్ లో నిలవ‌డం విశేషం. 53,000ఓట్లు..9.6రేటింగ్ తో ఈ చిత్రం సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రంలో త‌మిళ స్టార్ హీరో సూర్య లాయ‌ర్ పాత్ర‌లో ఒదిగిపోయారు. 1995 జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా లాయర్ చంద్రు జీవితం ఆధారంగా జై భీమ్ చిత్రాన్ని తీశారు. పోలీసుల అణచివేతకు గురైన బాధితుడి భార్య పోరాడేందుకు సహాయ పడే లాయర్ గా సూర్య మెస్మరైజ్ ఫెర్ఫామెన్స్ చేశాడు. తాజాగా జై భీమ్ సినిమా మరో ఘనత సాధించింది. ఉత్తమ నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారానికి నామినేట్‌ అయింది ‘జై భీమ్‌’. ఆస్కార్ అవార్డ్ త‌ర్వాత అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్ర రంగంలో గోల్డెగ‌న్ గ్లోబ్ పుర‌స్కారాల‌ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు అనే సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement