Friday, April 19, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర 10 గ్రాములకు రూ.140 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.54 వేల 710 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక స్వచ్ఛమైన పసిడి 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.150 మేర దిగివచ్చి ప్రస్తుతం రూ.59 వేల 690 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.50 తగ్గి ప్రస్తుతం రూ.54 వేల 900 వద్ద ఉంది. మరోవైపు.. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.110 తగ్గి తులం రేటు రూ.59 వేల 880 వద్ద కొనసాగుతోంది. వెండి విషయానికి వస్తే గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో కిలో పుత్తడి రేటు ) ఇవాళ రూ.76,000 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రేటు వరుసగా నాలుగు రోజులు రూ.1800 మేర పెరగగా ఇవాళ కాస్త తగ్గింది. కిలోపై రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.73 వేల 300 వద్ద ట్రేడవుతోంది. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం రేటు కాస్త తక్కువ, వెండి రేటు ఎక్కువగా ఉంటుంది. అందుకు ప్రధానంగా స్థానిక పన్నులు కారణమవుతాయి. అంతర్జాతీయంగానూ బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావంతో స్పాట్ గోల్డ్ ఔన్సుకు మరింత తగ్గి ప్రస్తుతం 1960 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement