Thursday, December 8, 2022

త‌గ్గుతోన్న బంగారం ధ‌ర‌లు.. పెరుగుతున్న వెండి

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ఇటీవల గోల్డ్ భారత మార్కెట్లో 7 నెలల గరిష్టానికి చేరిన విషయం తెలిసిందే. అంటే ఏప్రిల్‌లో ఉన్న ధరల్ని మించి నాలుగు రోజుల కిందట ట్రేడయ్యాయి. మళ్లీ అప్పటినుంచి తగ్గుతున్నాయి.ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 100 మేర తగ్గింది. గత 5 రోజుల్లో మొత్తంగా రూ.500 తగ్గింది.

- Advertisement -
   

ఈ వ్యవధిలో గోల్డ్ రేటు అస్సలు పెరగకపోవడం విశేషం. ప్రస్తుతం తులం బంగారం రేటు రూ.48 వేల 250 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.110 తగ్గి.. 52 వేల 640కి పడిపోయింది.వెండి విషయానికి వస్తే హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. వరుసగా 4 రోజుల వ్యవధిలో రూ.1000 మేర తగ్గి.. 1500 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.500 పెరిగి రూ. 67 వేల 500కు చేరింది. దిల్లీలో వెండి ధర చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇతర ప్రాంతాల్లోనూ అక్కడి పరిస్థితులు, పన్నులను బట్టి రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement