Thursday, April 25, 2024

స్థిరంగా బంగారం ధరలు.. తగ్గిన వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి రేట్లు పెరుగుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే నెల గరిష్టానికి చేరాయి గోల్డ్ రేట్లు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.47 వేల 360 వద్ద ట్రేడవుతోంది. ముందు రోజు మాత్రం ఏకంగా రూ.560 మేర రేటు పెరిగింది. ఇక 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు హైదరాబాద్‌లో రూ. 51 వేల 670 వద్ద ఉంది. బంగారంతో పోలిస్తే వెండి ధర కాస్త తగ్గింది. వరుసగా 5 రోజుల్లో ఏకంగా రూ.3400 మేర సిల్వర్.. ప్రస్తుతం రూ.400 తగ్గి కిలోకు రూ.67 వేల వద్ద కొనసాగుతోంది. పండగ సీజన్‌లో చాలా కనిష్టాలకు పడిపోయిన బంగారం, వెండి ధరలు మళ్లీ నెల గరిష్టాలకు పెరగడంతో కొనాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు జనం. అయితే రానున్న రోజుల్లోనూ హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా యూఎస్ ఫెడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement