Thursday, April 18, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.45,950కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,130గా రికార్డయింది. బంగారం ధర పెరిగిన ఈ సమయంలో మాత్రం వెండి రేటు కిందకి పడిపోయింది. వెండి ధర నేటి మార్కెట్లో రూ.200 తగ్గి రూ.62 వేల కిందకి చేరింది. దీంతో ఈ రేటు రూ.61,800గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది. బంగారంతో పాటు వెండి రేటు కూడా అక్కడ పెరిగింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.46,100కు పెరిగింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధరపై రూ.120 మేర ధర పెరగడంతో.. ఈ రేటు రూ.50,290కి చేరుకుంది. వెండి రేటు ఢిల్లీలో రూ.500 పెరిగి కేజీ రూ.57,200గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement