Wednesday, April 24, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.45,800గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.230 తగ్గి రూ.49,970గా రికార్డయింది. బంగారంతో పాటు వెండి రేటు కూడా తగ్గింది. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ.900 తగ్గి రూ.55,400గా నమోదైంది. బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా భారీగా పడిపోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.200 తగ్గి రూ.45,950గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.50,130గా రికార్డయింది. బంగారంతో పాటు వెండి రేటు కూడా ఢిల్లీలో తగ్గిపోయింది. కేజీ వెండి రేటు రూ.900 తగ్గి రూ.55,400గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement