Thursday, March 28, 2024

పెరిగిన బంగారం ధ‌ర – ప‌రుగులు పెట్టిన వెండి రేటు

రోజుకోలా మారుతున్నాయి బంగారం..వెండి ధ‌ర‌లు. నేడు మే 28న పసిడి రేటు రూ. 110 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,090కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరుగుదలతో రూ. 47,750కు ఎగసింది. కాగా బంగారం ధరలు నిన్న తగ్గిన విషయం తెలిసిందే. రూ. 270 వరకు దిగి వచ్చింది. మరోవైపు ఈరోజు వెండి రేటు కూడా పరుగులు పెట్టింది. రూ. 600 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 66,600కు చేరింది. కాగా వెండి రేటు నిన్న రూ. 500 పడిపోయిన విషయం తెలిసిందే. బంగారం వెండి ధరలు ట్రెండ్ మారుస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్న పసిడి రేట్లు నిరోధ స్థాయికి పైకి చేరాయి. అయితే బంగారం ధరలు పైస్థాయిలోనే క్లోజ్ అవుతాయా? లేదా? అనేది చూడాది. వెండి రేటు 22 డాలర్ల పైనే ముగిసింది. అయితే బంగారం ధర మాత్రం 1860 డాలర్ల పైన క్లోజ్ కాలేదు. 1851 డాలర్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో బంగారం ధర 1862 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. పసిడి రేటు మళ్లీ 1860 డాలర్ల పైకి చేరితే.. మరోసారి ధరల పెరుగుదల ఉండొచ్చని నిపుణులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement