Thursday, April 25, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి ధ‌ర‌

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో ఇవాళ రూ.150 పెరిగి రూ.45,950గా పలుకుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.50,130గా నమోదైంది. ఈ వారం ప్రారంభం నుంచి చూసుకుంటే మాత్రం 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర రూ.780 మేర తగ్గింది. ఈ వారం ప్రారంభంలో ఈ ధర రూ.46,730గా ఉంటే.. నేడు ఈ రేటు రూ.45,950గా పలుకుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర రూ.850 మేర పడిపోయింది. ఈ రేటు రూ.50,980 నుంచి రూ.50,130కు తగ్గింది. బంగారం ధరలు భారీగా పడిన ఈ సమయంలో.. వెండి రేట్లు మాత్రం స్వల్పంగానే తగ్గుదలను నమోదు చేశాయి. వారం ప్రారంభంలో రూ.62,400గా ఉన్న కేజీ వెండి ధర నేడు రూ.62 వేలుగా నమోదైంది. అంటే కేవలం రూ.400 మేరనే వెండి ధర తగ్గింది. ఈ వారం వెండి ధరలలో అనూహ్యమైన ట్రెండ్ కనిపించింది. నాలుగు సార్లు ధరలు పెరగగా.. 2 సార్లు మాత్రం ధరలు తగ్గాయి. ఇవాళ కేజీ వెండిపై రూ.400 మేర ధర పెరగడంతో.. ఈ రేటు రూ.62 వేలుగా రికార్డయింది. వారం రోజులుగా బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement