Friday, April 19, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు ఇవాళ ఒక్కరోజే రూ.1500 పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం హైదరాబాద్‌లో రూ. 55,300కు చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులానికి రూ.1630 మేర పెరిగి ప్రస్తుతం రూ.60 వేల 320 పలుకుతోంది. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1500 పెరిగి ప్రస్తుతం రూ.55 వేల 450కు చేరింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం దిల్లీలో 10 గ్రాములకు రూ.1630 పెరిగింది.

ప్రస్తుతం రూ.60 వేల 470కి చేరింది. గోల్డ్ రేట్ల మాదిరిగానే ఆకాశాన్నంటుతున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లో సిల్వర్ కిలోకు రూ.1300 పెరిగింది. ప్రస్తుతం కిలో ధర రూ.74 వేల 400 పలుకుతోంది. ఇక దేశ రాజధాని హస్తినాలో కిలో వెండి ధర రూ.2300 మేర పెరిగింది. ప్రస్తుతం రూ.72 వేల 100 వద్దకు చేరింది. హైదరాబాద్‌తో పోలిస్తే దేశ రాజధానిలో బంగారం ధరలు కాస్త ఎక్కువ, వెండి ధర కాస్త తక్కువగా ఉంటుంది. అందుకు స్థానిక పన్నులు ప్రధాన కారణమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement