Saturday, April 20, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్, దిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1928.65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.81.603 వద్ద ఉంది. హైదరాబాద్‌లో బంగారం ధర పెరగ్గా.. వెండి ధర పడిపోయింది. ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు హైదరాబాద్‌లో రూ.150 పెరిగి.. రూ.52,650 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రోజు రూ.600 మేర పతనమైంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్‌లో రూ.170 పెరిగి రూ.57,440 మార్కుకు చేరింది.

ఇది కూడా క్రితం రోజు రూ.600 తగ్గింది. అంతకుముందు మాత్రం వరుసగా 5 రోజుల్లో పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. అక్కడ రూ. 150 పెరగ్గా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,800కు చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 170 ఎగబాకి.. రూ.57,590 వద్ద కొనసాగుతోంది.మరోవైపు వెండి ధరలు మాత్రం పడిపోయాయి. దిల్లీలో తాజాగా రూ.400 తగ్గగా..కిలోకు రూ.72,200కు చేరింది. అంతకుముందు వారం రోజుల్లో మాత్రం అస్సలు తగ్గకపోవడం గమనార్హం. ఇక హైదరాబాద్‌లో మాత్రం బంగారం వరుసగా రెండో రోజు రూ.400 మేర పతనం కాగా.. ప్రస్తుతం కిలోకు రూ. 74,200 మార్కు వద్ద కొనసాగుతోంది. కొద్దిరోజుల కిందట రూ.76 వేల మార్కును కూడా చేరింది. మళ్లీ ఇప్పుడిప్పుడే తగ్గుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement