Tuesday, April 16, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.52,700 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు వరుసగా రెండు రోజుల్లో రూ.450 మేర పెరిగింది. ఇవాళ మాత్రం ఎలాంటి మార్పూ లేదు. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.57,490 మార్కు వద్ద ఉంది. ఇదే సమయంలో దిల్లీలో కూడా బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా ట్రేడవుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ దిల్లీలో రూ.52,850 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,650 వద్ద కొనసాగుతోంది. సీనియర్లకు ఊతం.. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్.. వారికి మరింత బూస్ట్..బంగారం ధరలు స్థిరంగా ఉన్న నేపథ్యంలో వెండి రేట్లలో కూడా ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.74 వేల మార్కు వద్ద స్థిరంగా ఉంది. అంతకుముందు రోజు మాత్రం రూ.700 మేర పడిపోయింది. ఇక దిల్లీలో కూడా సిల్వర్ రేటు స్థిరంగా ఉంది. కిలోకు రూ.72,500 వద్ద కొనసాగుతోంది. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో సిల్వర్ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా ఎక్కువ పన్నులు ఉండటమే ఇందుకు కారణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement