Friday, April 19, 2024

నేటి బంగారం.. వెండి ధరలు

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి.. .బంగారం, వెండి ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి 2న చాలా రోజుల తర్వాత గోల్డ్ రేట్లు తగ్గాయనుకునే లోపే.. మరుసటి రోజు మళ్లీ ఎగబాకాయి. భారీగా పెరిగాయి. దీంతో ఏకంగా రెండేళ్ల గరిష్టాలను తాకాయి. చివరగా 2020 ఆగస్టులో గోల్డ్ రేట్లు ఇంతటి స్థాయిలో ఉండగా.. మళ్లీ ఇప్పుడు అదే స్థాయికి పెరిగాయి.హైదరాబాద్‌లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర తాజాగా రూ.500 మేర పెరిగింది.

దీంతో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు హైదరాబాద్‌లో రూ.50,950 కు చేరింది. ఇక 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు కూడా రూ.540 మేర ఎగబాకింది. ప్రస్తుతం ఈ ధర రూ.55,580 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటే దిల్లీలో కూడా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. దిల్లీలో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.500 మేర పెరగ్గా.. మొత్తం రేటు రూ.51 వేల మార్కును అధిగమించింది. ప్రస్తుతం రూ.51,100 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 530 మేర పెరగ్గా.. ప్రస్తుతం రూ.55,730 మార్కు దాటింది.యూఎస్ డాలర్ పడిపోతుండటం కారణంగా.. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇది రానున్న రోజుల్లోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, దిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఓసారి చూద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement