Thursday, March 28, 2024

భారీగా తగ్గిన బంగారం ధరలు..

దేశంలో బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి… ఈ వారంలో బంగారం రేటు పెరగకుండా తగ్గడం ఇదే తొలిసారి…హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి రూ.44,900కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 390 తగ్గి రూ. 48,390కి చేరింది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు కొంతమేర తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. ఇక బంగారం ధరలు తగ్గితే.వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగాయి. కిలో వెండి ధర రూ.4000 పెరిగి రూ. 71,500 వద్ద కొనసాగుతోంది. అయితే వచ్చే నెల శ్రావణ మాసం కావడంతో ఆషాడంలోనే బంగారం కొనుగోలు చేస్తుంటారు.. కాబట్టి ఇప్పుడు బంగారానికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది..ఇవాళ బంగారం రేటు స్పల్పంగా తగ్గిన్నప్పటికి రానున్న నెల రోజులపాటు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఈ మేకల జతకు రూ.1.50 లక్షలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement