Wednesday, March 29, 2023

మళ్లీ భారీగా పెరిగిన పసిడి ధరలు

దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గతకొన్ని రోజులగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకానొక సమయంలో రూ. 55 వేలకు చేరుకున్న తులం బంగారం ధర తర్వాత రూ.47 వేలకు దిగువకు చేరుకుంది. ఈ మధ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. తాజాగా శుక్రవారం మళ్లీ పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగి రూ. 46,900 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 43,000 కు చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ. 71,300కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 350 పెరిగి.. 45,150 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 49,250 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 66,660గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,550 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,550 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,660 గా ఉంది. కాగా, కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనల నడుమ లాక్‌డౌన్ భయాందోళనలు పెరిగిపోతున్న నేపధ్యంలో మదుపర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడులుగా పసిడి వైపు దృష్టి పెడ్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement