Thursday, April 25, 2024

బంగారం పరుగులు.. నేటి ధరలు ఇలా..

బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గతకొన్ని రోజులగా మళ్లీ ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా శనివారం బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 పెరిగి రూ. 47,460 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 43,500 కు చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ. 72,100 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.10 పెరిగి.. 45,160 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 49,260 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 67,500గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,560 గా ఉంది. 24 క్యారెట్ల ధర రూ. 45,560 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,500 గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,500 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,460 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 67,500 కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement