Thursday, March 28, 2024

మ‌ళ్లీ స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌.. ఇవ్వాల్టి రేట్ ఎంతంటే

బులియ‌న్ మార్కెట్లో రోజు రోజుకూ బంగారం, వెండి ధ‌ర‌లు అటు ఇటు అవుతున్నాయి. కానీ, దాదాపు 50వేల మార్కు వ‌ద్ద మాత్రం ట్రేడ్ కావ‌డం ఖాయంగా ఉంటోంది. ఇవ్వాల హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధ‌ర నిన్న‌టి కంటే జ‌రంత పెరిగింది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం 46, 100 ఉండ‌గా ఇవ్వాల (శుక్ర‌వారం) అది కాస్త 200 రూపాయ‌లు పెరిగి 46,300 అయ్యింది. కాగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల (తులం) ధ‌రం నిన్న 50,290 ఉండ‌గా.. ఇవ్వాల (శుక్ర‌వారం) 220 పెరిగి 50, 510 రూపాయ‌లుగా ఉంది..

ఇక‌.. వెండి అయితే ఎట్లాంటి తేడా లేకుండా నిన్న‌ట ధ‌ర‌ల‌తోనే ఇవ్వాల (శుక్ర‌వారం) కూడా కొన‌సాగుతోంది. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో కిలో వెండి ఇవ్వాల 65వేల రూపాయ‌లుగా ఉంది. కొనాలనుకునే వారు ఇప్పుడు కొనుక్కుంటే మంచిద‌ని వ్యాపారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement