Thursday, March 28, 2024

Gold Rate: బంగారం దిగివస్తోంది.. కాస్త తగ్గిన ధర

నిన్న కాస్త పెరిగిన బంగారం, వెండి ధరలు ఇవ్వాల కాస్త ఊరటనిచ్చాయి. ఇవ్వాల దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉక్రెయిన్​, రష్యా యుద్ధాల కారణంగా ఒక్కసారిగా ఎగబాకిన పసిడి, సిల్వర్​ రేట్లు ఇప్పుడిప్పుడే దిగొస్తున్నాయి. ఇవ్వాల్టి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్​లో 46,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,290గా నమోదైంది. నిన్న (బుధవారం) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 46,550 ఉండగా ఇవ్వాల (గురువారం) 450 రూపాయలు తగ్గింది.

అదేవిధంగా వెండి ధరలు కూడా కాస్త తగ్గింది. నిన్నటి కంటే ఇవ్వాల కిలో వెండి ధర 200 రూపాయలు తగ్గి 65,400గా నమోదైంది. ఇది హైదరాబాద్​లో ఉన్న ధర మాత్రమే. వేర్వేరు నగరాల్లో ధరల తీరులో కాస్త వ్యత్యాసం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement