Saturday, April 20, 2024

గోల్డ్ పేరుతో రూ. 84ల‌క్ష‌ల‌కి టోక‌రా..

మోస‌పోయేవారు ఉన్నంత వ‌ర‌కు మోసాలు జ‌రుగుతూనే ఉంటాయి. ఇప్పుడ‌దే జ‌రిగింది..మోసం చేయ‌డానికి..ఆడ‌,మ‌గ అనే తేడాలు లేకుండా పోతున్నాయి. కాగా తాను క‌స్ట‌మ్స్ అధికారిన‌ని చెబుతూ త‌క్కువ రేట్ కే గోల్డ్ అమ్ముతామ‌ని ఒక మ‌హిళ చేసిన మోసం వెలుగులోకి వ‌చ్చింది. ఈ సంఘ‌ట‌న బెంగ‌ళూర్ లో చోటు చేసుకుంది. ఈ మేర‌కు రూ. 84ల‌క్ష‌ల‌కి టోక‌రా వేసింది. కాగా బాధితుడిని శివాజీన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన 35 ఏండ్ల వ్య‌క్తిగా గుర్తించారు. నిందితురాలు ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో తాను క‌స్ట‌మ్స్ ఆఫీస‌ర్‌న‌ని చెబుతూ బాధితుడితో ప‌రిచ‌యం పెంచుకుంది. త‌క్కువ రేటుకే గోల్డ్ బార్స్ విక్ర‌యిస్తాన‌ని మ‌భ్య‌పెట్టి అత‌డిని నిండా ముంచింది. తాను నిందితురాలికి రూ 71.60 ల‌క్ష‌లు ఇచ్చాన‌ని, ఆన్‌లైన్ ద్వారా మ‌రో రూ 12.40 ల‌క్ష‌లు ఆమె బ్యాంక్ ఖాతాకు జ‌మ చేశాన‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు.ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement