Tuesday, March 26, 2024

బంగారం ధరకు మళ్లీ రెక్కలు

ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.881 పెరిగి రూ.44,701కి చేరింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.1,071 పెరిగి రూ.63,256కి చేరింది. కరోనా కేసులు మళ్లీ పెరగడం, సురక్షిత పెట్టుబడి సాధనంగా మదుపర్లు పసిడిని ఎంచుకోవడం, అంతర్జాతీయ విపణిలో లోహపు ధరలు పెరగడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు పెరిగినట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అలు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.45,440కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.41,650కి చేరింది. ఇక వెండి కూడా ధర పెరిగింది. కేజీపై రూ.1,400 పెరిగి రూ.68,700గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement