Friday, April 19, 2024

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నేటి రేట్లు ఇలా..

పడిసి ప్రియులకు ఇది శుభవార్త. రెండు రోజుల నుంచి పసిడి ధరలు దిగివస్తున్నాయి. శనివారం కూడా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.47,350కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గుదలతో రూ.43400కు చేరింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.65,900 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,390 ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,390గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement