Wednesday, April 24, 2024

Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్‌న్యూస్. వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గింది. దీంతో పసిడి ధర రేటు రూ.46,750 వేల దిగువ దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 మేర తగ్గడంతో పసిడి రేటు రూ.51 వేలకు చేరింది. వెండి కూడా బంగారం దారిలోనే నటించింది. వెండి ధర రూ.1300 మేర తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.64,800కు దిగొచ్చింది. ఏపీలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement