Saturday, April 20, 2024

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం రేటు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పిడింది. దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.49,900కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 తగ్గుదలతో రూ.45,740కు పడిపోయింది.

విజ‌యవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,900 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 45,740 గా ఉంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 52,240 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,890కు చేరింది. ఇక, వెండి రేటు కూడా పసిడి దారిలోనే నడిచింది. వెండి ధర రూ.300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.70,400కు క్షిణించింది. ప్ర‌స్తుతం పెళ్లిల సిజన్ కావడంతో బంగారం ధ‌ర‌లు త‌గ్గుతుండ‌టం సామాన్యులకు కాస్త ఊర‌టనిచ్చే విషయం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement