Thursday, April 18, 2024

GOLD News: నేటి బంగారం, వెండి రేట్లు ఇవీ..

బంగారం ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. నిన్నమొన్నటి వరకు పెరిగిన పసిడి ధరలు.. ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం రేటులో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. పసిడి బాటలో వెండి ధర దిగొచ్చింది.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. విజ‌య‌వాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,180 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధ‌ర రూ. 46,000 వద్ద కొనసాగుతోంది. ఇక, బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. వెండి ధర దాదాపు రూ.700 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.70,700కు తగ్గింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement