Tuesday, October 26, 2021

పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా..

పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చారు. గోల్డ్ రేట్ అమాంతం పెరిగాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు రూ.350కు పైగా పెరిగింది. వెండి కూడా అదే దారిలో పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,350కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,400కు పెరిగింది. ఇక, వెండి ధర రూ.700 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.63,700కు చేరింది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉంది.

ఇది కూడా చదవండిః నేను గెలిస్తే తెలంగాణ రాజకీయ చరిత్ర మారుతుంది: ఈటల

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News