Thursday, April 25, 2024

మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది.  హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.49,480కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.45,350కు ఎగసింది. ఇక, వెండి ధర కూడా బంగారం దారిలోనే నడిచింది. వెండి రేటు రూ.400 పెరుగుదలతో కేజీ వెండి ధర రూ.66,200కు చేరింది.

విజ‌య‌వాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 66,200 వద్ద కొనసాగుతోంది.

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,800 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,500గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 62,300గా నమోదైంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,300కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,300 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 62,300గా ఉంది.

కోల్‌క‌త్తలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,200గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,500 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 62,300కి ఎగసింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement