Thursday, April 25, 2024

Gold Rate: మహిళలకు షాక్.. రెండు రోజుల్లో రూ.900 పెరిగిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధర మళ్లీ పరుగులు పెడుతోంది. నిన్న పెరిగిన బంగారం ధర నేడు కూడా పైపైకి కదిలింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ రేటు భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెరిగింది. దీంతో పసిడి ధర రూ. 52,590కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరుగుదలతో రూ. 48,200కు ఎగసింది.  ఇక వెండి ధర ఏకంగా రూ.1000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 73,800కు చేరింది. కాగా, బంగారం ధర 2 రోజుల్లోనే రూ.900కు పైగా పెరగగా..  వెండి రెండు రోజుల్లో రూ.1900 పైకి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement