Friday, April 26, 2024

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం ధర నేడు దిగొచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.48,930కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి.. రూ.44,850కు క్షిణించింది.

ఇక, వెండి ధర కూడా బంగారం దారిలోనే నడిచింది. వెండి రూ.1100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,500కు చేరింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సంతోషం కలిగించే అంశమనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement