Friday, April 19, 2024

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు వరుసగా రెండో రోజు పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.48,760కు తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గుదలతో రూ.44,700కు చేరింది.

విజ‌య‌వాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,760 వ‌ద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 44,700కి చేరింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 400 వ‌ర‌కు త‌గ్గి రూ. 51,100 వ‌ద్ద‌ ఉండగా… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 46,850కి క్షిణించింది. ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 47,630కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 46,630కు చేరింది.

ఇక, వెండి రేటు కూడా బంగారం దారిలో పయనించింది. వెండి ధర ఏకంగా రూ.1900 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.67,600కు క్షీణించింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది తీపికబురు అని చెప్పొచ్చు. చాలా రోజుల త‌ర్వాత వ‌రుసగా రెండు రోజుల పాటు భారీగా ధ‌ర‌లు త‌గ్గడం ఇదే మొద‌టి సారి. పెళ్లిల సిజ‌న్ లో ఇలా బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డం సామాన్య‌లకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం అనే చెప్పాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement