Tuesday, April 16, 2024

విరిగిన విగ్ర‌హం చెయి..క‌ట్టు క‌ట్ట‌మంటూ ప‌ట్టుబ‌ట్టిన పూజారి..ఎక్క‌డో తెలుసా..

భ‌క్తుడి కోసం దేవుడు దిగి వ‌స్తాడా అంటే దేవుడు రాక‌పోవ‌చ్చు కానీ ఆయ‌న రూపంలో ఎవ‌రో ఒక‌రు వ‌చ్చి స‌హాయం చేస్తార‌ని అనుకుంటుంటాం..అదే సినిమాల్లో అయితే దేవుడే దిగి వ‌చ్చిన‌ట్లు చూపిస్తుంటారు. మ‌రి దేవుడి కోసం పూజారులు ఏం చేస్తారు అంటే అదేం ప్ర‌శ్న..నిత్యం స్వామివారి సేవ‌లో ఉంటార‌ని చెబుతాం. మ‌రి ఆ సేవ శృతి మించితే ఏం జ‌రుగుతుందో తెలుసా..అది తెలియాలంటే ఈ స్టోరీని చ‌ద‌వాల్సిందే..దేవుడిపై భ‌క్తి పెరిగి స్వామి వారి విగ్ర‌హంలోని చెయి విరిగినందుకు నానా హంగామా చేశాడు ఓ పూజారి. వివ‌రాల్లోకి వెళ్తే..కృష్ణుడి విగ్రహానికి చేయి విరిగింది.. కట్టు కట్టాలంటూ ఓ పూజారి ఆసుపత్రికి వెళ్లి నానా యాగీ చేశాడు. చివరకు అతడి గోలను తట్టుకోలేక శ్రీకృష్ణ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసిన వైద్యులు విగ్రహానికి కట్టుకట్టారు.

మ‌రి ఈ విచిత్రమైన సంఘటన ఎక్క‌డ జ‌రిగిందో తెలుసా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అర్జున్‌నగర్‌లోని ఖేరియా మోడ్‌లోని పత్వారీ ఆలయ పూజారి లేఖ్‌ సింగ్‌ కృష్ణుడి విగ్రహాన్ని ఆసుపత్రికి వచ్చారు. ఉదయం స్నానం చేయిస్తున్న సమయంలో విగ్రహం జారిపడి చేయి విరిగిందని.. వెంటనే కట్టు కట్టాలని సిబ్బందిని వేడుకున్నారు. ఈ వింత డిమాండ్‌కు అక్కడి వైద్యులు, సిబ్బంది విస్తుపోయారు.విగ్రహానికి కట్టుకట్టలేమని వారు తిరస్కరించడంతో పూజారి నిగ్రహం కోల్పోయి.. తన తలను గోడకేసి బాదుకున్నాడు.

దీంతో అతడికి గాయలు కాగా.. వైద్యులు వచ్చి నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న హిందూ మహాసభ సభ్యులు అక్కడికి చేరుకుని అతడికి సర్దిచెప్పారు. పూజారి తృప్తి కోసం ఆ విగ్రహానికి ప్లాస్టర్‌తో కట్టు కట్టామని ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అశోక్‌ అగర్వాల్‌ తెలిపారు. లేఖ్‌ సింగ్‌ హార్ట్‌ పేషెంట్‌ కావడంతో అతడిని ఇబ్బంది పెట్టకూడదనే ఇలా చేశామని వివరణ ఇచ్చారు. శ్రీకృష్ణుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేశామని డాక్టర్ అగర్వాల్ పేర్కొన్నారు. భ‌క్తి ముదిరి పీక్స్ కి వెళ్ళిపోయింద‌ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్..అంద‌రినీ కాపాడే భ‌గ‌వంతుడి విగ్ర‌హాం ప‌గిలితే ఇంత ర‌చ్చ అంటూ విస్తుపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement