Friday, April 19, 2024

ఇంటిని దోచుకుని – ఐ ల‌వ్యూ అని రాసిన దొంగ‌-అవాక్క‌యిన పోలీసులు

దొంగ‌లు అన్నాక అందిన‌కాడికి దోచుకొని పోతారు..అయితే ఇక్క‌డో దొంగ మ‌హా చిలిపిలా ఉన్నాడు. దొరిక‌నంత బంగారం..సొమ్ముని దోచుకొని పోవ‌డమే కాదు..ఐ ల‌వ్యూ అని రాసి పెట్టి వెళ్ల‌డం విశేషం. వివ‌రాలు చూస్తే.. గోవాలో ఓ బంగళాలోకి చొరబడిన దొంగ అందినకాడికి దోచుకుని ‘ఐ లవ్యూ’ అని రాసి మరీ వెళ్లాడు. గోవాకు చెందిన ఆసిబ్ జెక్ హాలీడేకు వెళ్లి రెండు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వచ్చాక లోపల గదులు చిందరవందరగా ఉండడంతో అనుమానం వచ్చిన ఆయన ఇంటిని పరిశీలించి చూసి విస్తుపోయాడు. ఇంట్లో ఉండాల్సిన రూ. 20 లక్షల విలువైన బంగారం, వెండి నగలతోపాటు రూ. 1.5 లక్షల నగదు చోరీకి గురైనట్టు గుర్తించి లబోదిబోమన్నాడు. అంతేకాదు, ఇంట్లోని టీవీ స్క్రీన్‌పై ‘ఐ లవ్యూ’ అని రాసి ఉండడాన్ని చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement