Tuesday, April 23, 2024

నీయబ్బరేయ్​.. పుల్లటి పండు తినిపిస్తవా! యజమానితో పెట్​డాగ్​ సయ్యాట! (వీడియో)

పెట్​ డాగ్స్​తో ఉండే రిలేషన్​, అనుబంధం మాటల్లో చెప్పలేనిది. అన్ని జంతువుల్లో కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య పెట్​ డాగ్స్​పై వస్తున్న సినిమాల కూడా చాలా సక్సెస్​ అవుతున్నాయి. 777 చార్లీ మూవీ అయితే సైలెంట్​గా రిలీజ్​ అయ్యి.. బంపర్​ హిట్​ కోట్టేసింది..

కాగా, బుక్​మై షోలో దీనికి 97 పర్సంటేజ్​ లైక్​ చేశారంటే మామూలు విషయం కాదు. ఇక ఈ మధ్యనే ఈ సినిమా చూసిన కర్నాటక సీఎం బస్వరాజు బొమ్మై కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఈ మూవీ చూస్తుంటే తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చిందని మీడియాకు చెప్పాడు..

అయితే ఇక్కడో వీడియో ఉంది. ఇందులో ఒకతను దబ్బనిమ్మపండుని పదునైన కత్తితో ముక్కలుగా కోస్తున్నాడు. ఆ పక్కనే పెట్​ డాగ్​ ఉంటుంది. అతను స్లయిస్​ కోస్తుంటే అది అతని చేతిపై కాలుతో తడుతుంది. అంటే తనకు ఒక ముక్క ఇవ్వమని కోరినట్టు అర్థం చేసుకోవాలి..

అప్పుడు ఆ కత్తికి అంటుకున్న ముక్కను తీసి దాని నోట్లో పెడతాడు.. ఇక ఆ పుల్లని నిమ్మపండు ముక్క నోట్లో పెట్టుకుని కాస్త నమలగానే దాని నోరంతా పుల్లటి రసంతో అదోలా అవుతుంది. దాంతో ఆ డాగ్​ యజమాని ముసి ముసిగా నవ్వుకుంటూ ఉంటాడు.. అంతలోనే ఆ కుక్క అతని తలపై కాళ్లతో తడుముతూ తనకు కావాలనే పుల్లటి పండుని అందించాడని.. ఆట పట్టించాడని అలా తడమడం అందరినీ బాగా ఇంప్రెస్​ చేస్తుంది.. ఫన్నీగా ఉన్న ఈ వీడియోని మీరూ చూసి కాసేపు నవ్వుకోండి..

https://twitter.com/TheFigen/status/1537156252995919876
Advertisement

తాజా వార్తలు

Advertisement