Thursday, April 25, 2024

అందుకే సరోగసి ఎంచుకున్నా.. గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా

అందుకే సరోగసి ఎంచుకున్నానని గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా అన్నారు. మల్తీ పుట్టినప్పుడు తాను ఆపరేషన్‌ థియేటర్‌లోనే ఉన్నా. తను చాలా చిన్నది. నా చెయ్యి కంటే చిన్నగా ఉంది. డ్యూ డేట్‌ కంటే మూడు నెలల ముందే పుట్టింది. తనను ఇంటికి తీసుకు రావడానికి ముందు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింద‌ని తెలిపారు ప్రియాంక చోప్రా. ఈ సందర్భంగా బిడ్డను కనేందుకు సరోగసిని ఎంచుకోవడం పట్ల ప్రియాంక స్పందించింది. నాకు వైద్యపరమైన సమస్యలు ఉన్నాయి అని తెలిపింది. అయితే అవి ఏంటనేది వెల్లడించలేదు.బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్‌’తో 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్‌ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. వివాహమైన తర్వాత నుంచి ఆమె తన భర్త నిక్‌తో కలిసి లాస్ఏంజెల్స్‌లోనే ఉంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement