Sunday, March 26, 2023

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక‌చోప్రా.. నిక్ తో విడిపోనుందా..అస‌లేం జ‌రిగింది..!

ప్రేమ‌,పెళ్ళి,విడాకులు ఇదే తంతు న‌డుస్తోంది ప‌లువురి విష‌యంలో..భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య స‌మ‌స్య‌ల‌నేవి సాధార‌ణ‌మే..అయితే ఈ విష‌యంలో సామాన్యుల‌యితే స‌ర్దుకుపోయి బ‌తికేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు..కానీ సెల‌బ్రిటీల విష‌యానికి వ‌స్తే వ‌ద్దు అనుకుంటే వ‌ద్ద‌నే రీతిగా ఉంటున్నారు. ఇప్ప‌టికే ఎన్నో జంట‌లు విడిపోయాయి. రీసెంట్ గా అయితే నాగ‌చైత‌న్య‌, స‌మంతలు త‌మ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి..చెరో దారిలో ప‌య‌నిస్తున్నారు. ఇప్పుడ‌దే దారిలో మ‌రో జంట ఉండ‌నుంద‌నే రూమ‌ర్ వినిపిస్తోంది. మ‌రి ఎవ‌రా జంట‌..వివ‌రాలు చూస్తే…పెళ్ళికి ముందు ప్రేమ ఎన్ని ఏళ్ళ‌యినా ఉంటుంది..అదేంటో పెళ్ళికాగానే రెండు, మూడు సంవ‌త్స‌రాల‌కే ఒక‌రంటే ఒక‌రికి మొహాలు మొత్తేస్తుండ‌టం విడ్డూరం. ఇది సినీ సెల‌బ్రిటీల‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. దాంతో పెళ్లి బంధాన్ని విడాకుల‌తో తెంచుకుంటున్నారు..

గ్లోబ‌ల్ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ ని వీడి హాలీవుడ్ కి వెళ్ళి అక్క‌డే సెటిల్ అయింది ప్రియాంక‌చోప్రా..కాగా త‌న‌కంటే వ‌య‌సులో చిన్న‌వాడ‌యిన అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జొనాస్ తో ప్రేమాయ‌ణం త‌ర్వాత పెళ్లి ఇవ‌న్నీ తెలిసిన విష‌యాలే..దాంతో అమెరికా కోడ‌లుగా మారిపోయింది ప్రియాంక‌చోప్రా.. ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా భర్త కు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు రూమ‌ర్స్ పుట్టుకొస్తున్నాయిద‌. అందుకు కారణం రీసెంట్ గా ఆమె చేసిన పనే. ప్రముఖ పాప్‌సింగర్‌ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక.. నిక్‌ జోనాస్‌ మ్యూజిక్‌ వీడియోల్లో కూడా ఒక్కోసారి మెరిసింది. పెళ్లయిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాల్లో పేరును ‘ప్రియాంకా చోప్రా జోనాస్‌’గా మార్చుకుంది. ఇటీవలే వీరిద్ద‌రూ కలిసి దీపావళి పూజాకార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇప్పుడు ఏమైందో సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన పేరు చివర భర్త పేరు తీసేసిందీ బ్యూటీ.

- Advertisement -
   

అదిగో దాంతో మొద‌ల‌య్యాయి పుకార్లు..అంతే కాదండోయ్ తన ఇన్‌స్టాలో ప్రతిదానికి మొదలంటూ ఒకటుంటుంది అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకుంది. కాగా 2018 డిసెంబర్‌ 2వ తేదీన ఈ గ్లోబల్‌ జంట వివాహం చేసుకుంది. ఈ చర్యలు బాలీవుడ్ వర్గాలకు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. నిక్ నుంచి ప్రియాంక విడిపోనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి వారి రిలేషన్‌కు సంబంధించి వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పడాలంటే ప్రియాంక తన పేరు మార్చడంలో అంతర్యం ఏంటో క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి. సేమ్ టు సేమ్ టాలీవుడ్ న‌టులు చైత‌న్య‌..స‌మంత విష‌యంలో ఇలాగే జ‌రిగింది. ఇప్పుడు ప్రియాంక‌చోప్రా ఇంటి పేరు మార్చ‌డంపై క‌ధ‌లు పుట్టుకొస్తున్నాయి. అస‌లు ఇంటిపేరు మార్చాల్సిన అవ‌స‌రం ఏంటో ఆమె చెపితే గాని ఈ పుకార్ల‌కి చెక్ ప‌డ‌దు మ‌రి. అస‌లు అంతలా ప్రేమించి..పెళ్ళి చేసుకున్న జంట‌లు ఎందుకు విడిపోతున్నాయో వారికే తెలియాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement