Wednesday, April 24, 2024

కరోనా కాటుకు 30 లక్షల మంది బలి!

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా రక్కసి ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. కరోనా దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు.   మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య  30 లక్షలు దాటింది. వాస్తవ మరణాల సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా. బ్రెజిల్‌, భారత్‌, ఫ్రాన్స్‌లలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 12 వేల మందికి పైగా మరణిస్తున్నారు. అమెరికాలోనే ఇప్పటివరకు 5.6 లక్షల మంది కరోనాతో మృతి చెందారు. ప్రపంచం మొత్తం మరణాల్లో ఆరింట ఒక వంతు అమెరికాలోనే నమోదవుతున్నాయి. అమెరికా తర్వాతి స్థానాల్లో బ్రెజిల్,   మెక్సికో, ఇండియా, బ్రిటన్ ఉన్నాయి.

కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉద్ధృతంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అలాగే వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతం చేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ల కొరత పలు దేశాలను వేధిస్తున్నాయి. మరోవైపు, రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తుండటంతో పలు దేశాల్లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, అస్ట్రాజెనెకా టీకాలపై తాత్కాలిక నిషేధం విధించారు.

ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల టీకాలు అందుబాటులోకి రాగా భారత్.. ప్రముఖంగా రెండు రకాల టీకాలు వినియోగంలోకి వచ్చాయి. వాటిలో ఒకటి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా తయారు చేసిన కోవిషీల్డ్ కాగా, మరొకటి దేశీయ ఫార్మా దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దశల వారీగా దేశ ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement