Saturday, October 5, 2024

Brutal: ప్రియురాలు హత్య.. ముక్కలుగా చేసి కుక్కర్ లో …

ప్రియురాలిని హత్య చేసి.. ఆ తర్వాత కుక్కర్ లో ఉడికించిన దారుణ ఘటన ముంబయి సమీపంలోని థానేలో జరిగింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అతి దారుణంగా నరికి చంపాడు. అంతేగాకుండా మృతదేహాన్ని ముక్కముక్కలుగా చేసి ఫ్రెషర్ కుక్కర్ లో ఉడకబెట్టాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు బాధితురాలిని సరస్వతి వైద్య (32)గా గుర్తించారు. మీరారోడ్‌లోని గీతా నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సరస్వతి అనే మహిళ 56 ఏళ్ల మనోజ్ సాహ్నితో కలిసి 3 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు.

ఫ్లాట్ నుంచి వాసన వస్తుందని అపార్ట్ మెంట్ వాసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ కుళ్లిపోయి ముక్కముక్కలుగా ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఇద్దరు తరచూ గొడవలు పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బోరివాలలో చిన్న దుకాణంలో పనిచేస్తున్న మనోజ్ సరస్వతీ మృతదేహాన్ని చెట్టు కట్టర్ తో నరికి ఆమె శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడకబెట్టారని ముంబై పోలీసులు చెప్పారు. కుళ్లిపోయిన మృతదేహాన్ని బట్టి హత్య జూన్ 4 న జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొన్ని ముక్కలు కనిపించకుండా పోయాయని, వాటిని వేరే ప్రాంతాల్లో పడేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement