Thursday, April 18, 2024

జమ్ముకశ్మీర్ లో కొత్త పార్టీ పెడతా.. గులాం నబీ ఆజాద్

గులాం నబీ ఆజాద్ ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విధితమే. 5పేజీల రాజీనామా లేఖను ఆజాద్ సోనియా గాంధీకి పంపారు. తన రాజీనామా లేఖలో ఆయన రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. గాంధీలపై పదునైన దూషణలతో లేఖ రాసిన ఆయన పార్టీలో కీలక నిర్ణయాలన్నీ రాహుల్ సెక్యూరిటీ గార్డులు, వ్యక్తిగత సహాయకులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి రాసిన సుదీర్ఘ లేఖలో సీనియర్ నాయకులను పక్కన పెట్టడం, పార్టీలో అనుభవం లేనివాళ్ల కోటరీ పెరగడమే తన రాజీనామాకు ప్రధాన కారణాలుగా ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరనన్నారు. జమ్ముకశ్మీర్ లో కొత్త పార్టీ పెడతానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement