Saturday, April 20, 2024

వీడియో వైరల్: ఆలయంలో మంచినీళ్లు తాగిన ముస్లిం బాలుడిపై యువకుడి దాడి, అరెస్ట్

యూపీలోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. హిందూ దేవాలయంలోకి మంచినీళ్లు తాగేందుకు వెళ్లిన 12 ఏళ్ల ముస్లిం బాలుడిపై ఓ యువకుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను గమనిస్తే.. తొలుత దాడికి పాల్పడ్డ యువకుడు బాలుడిని పేరు అడిగాడు. అనంతరం తండ్రి పేరు అడిగాడు. దీంతో బాలుడు ఆసిఫ్, ఆదిఫ్ అని పేర్లు చెప్పగా.. గుడిలో నీకేం పని అని యువకుడు ప్రశ్నించాడు. అందుకు బదులుగా బాలుడు నీళ్లు తాగేందుకు వచ్చానని చెప్పాడు. అంతే ఒక్కసారిగా ఆ యువకుడు రెచ్చిపోయి బాలుడిపై దాడి చేశాడు. బాలుడిని కిందపడేసి కాళ్లతో తొక్కాడు. ఈ తతంగాన్ని యువకుడి స్నేహితుడు ఫోన్‌లో వీడియో తీయగా అది బయటకు వచ్చింది.

ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు నిందితుడు శృంగి నందన్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే యువకుడు గతంలోనూ ఓ బాలుడిపై దాడి చేసినట్లు తెలిసింది. కాగా తాజా ఘటనపై ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. ‘ఇదేనా రామాయణం, గీత, వేదాలు నేర్పించిన జ్ఞానం… ఇదేనా వసుదైక కుటుంబం అంటే…’ అని ప్రశ్నించారు. సబ్‌కా సాత్ సబ్‌కా విశ్వాస్ నినాదమంటే ఇదేనా… మత విద్వేషాలను, హింసను బీజేపీ ప్రేరేపిస్తోందని విమర్శించారు.

https://youtube.com/watch?v=LP8828UztRM
Advertisement

తాజా వార్తలు

Advertisement