Friday, April 19, 2024

ఆక‌ట్టుకుంటోన్న ‘గ‌ని’ ట్రైల‌ర్ – బాక్స‌ర్ గా వ‌రుణ్ తేజ్ బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టేనా

ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి తెర‌కెక్కిస్తోన్న చిత్రం గ‌ని..అల్లు బాబీ-సిద్ధు ముద్ద నిర్మాత‌. ఈ చిత్రంలో హీరోగా వ‌రుణ్ తేజ్..హీరోయిన్ గా స‌యీ మంజ్రేక‌ర్ న‌టిస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. నదియా .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీంచంద్ర కనిపించనున్నారు. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం విదేశాలకు వెళ్లి మరీ ఆయన బాక్సింగ్ లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గని .. ఇక లైఫ్ లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చెయ్’ అంటూ హీరోని తల్లి కోరడంతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ వెంటనే ‘గని’ని బాక్సింగ్ రింగ్ లో చూపించారు. తన కొడుకు తన మాట విన్నాడని ఆ తల్లి పొంగిపోతూ ఉంటుంది. ‘ఒకవేళ అమ్మకి నిజం తెలిసే రోజే వస్తే, అది తాను నేషనల్ ఛాంపియన్ విజేతగా నిలిచే రోజే కావాలి’ అని గని అనుకుంటూ ఉంటాడు. ఈ సొసైటీ ఎప్పుడూ గెలిచినవాడి మాటనే నమ్ముతుంది’ అనే డైలాగ్ బాగుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement